`ఆఫీస‌ర్‌`కి మెగాస్టార్ ప్ర‌మోష‌న్‌?

Tuesday, May 15th, 2018, 02:54:57 PM IST

దాదాపు 25 సంవ‌త్స‌రాల క్రితం రిలీజైంది ఖుదాగ‌వా. ఆ చిత్రంలో బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి కింగ్ నాగార్జున న‌టించారు. ఆ సినిమాలో శ్రీ‌దేవి ఓ క‌థానాయిక‌గా న‌టించింది. అప్ప‌ట్లో సెన్సేష‌న్ సృష్టించిన ఈ సినిమా ఇటు తెలుగులోనూ నాగార్జున క్రేజుతో రిలీజైంది. నాటి నుంచి అమితాబ్-నాగార్జున మ‌ధ్య బంధం బ‌లంగా ముడిప‌డింది. ఆ త‌ర‌వాత అక్కినేని అంత‌ర్జాతీయ అవార్డును బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ అందుకున్నారు. అందుకే అమితాబ్‌కి ఏఎన్నార్ అన్నా, ఆ ఫ్యామిలీ హీరోలు అన్నా ఎంతో అభిమానం.అలా ఇటీవ‌లే మ‌నం చిత్రంలో ఓ అతిధి పాత్ర‌లో న‌టించేందుకు అంగీక‌రించారు బిగ్‌బి.

అదంతా అటుంచితే ప్ర‌స్తుతం నాగార్జున న‌టించిన ఆఫీస‌ర్ రిలీజ్‌కి రెడీ అవుతోంది.ఈ సినిమా హిందీ ప్ర‌మోష‌న్ కో్సం అమితాబ్ త‌న‌వంతు సాయం చేస్తున్నారు. అంతేకాదు ఆఫీస‌ర్ ట్రైల‌ర్‌ని త‌న ట్విట్ట‌ర్‌లోనూ పోస్ట్చే సిన బిగ్‌బి డియ‌ర్ ఫ్రెండ్ నాగార్జున అంటూ సంబోధించారు. సామాజిక మాధ్య‌మాల్లో అమితాబ్‌కి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఈ ట్రైల‌ర్ అటు ఉత్త‌రాదినా బ్లాక్‌బ‌స్ట‌ర్ కొడుతోంది. ఒక‌వేళ అదే జ‌రిగితే ఆర్జీవీకి క్రేజు లేక‌పోయినా బాలీవుడ్ బిజినెస్‌కి క‌లిసొస్తుంది. మొత్తానికి త‌న టాలీవుడ్ స్నేహితుడికి బిగ్‌బి అలా సాయ‌ప‌డడం టాలీవుడ్‌లో ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది.