సంచలనం: ఆంధ్రప్రదేశ్ లో గుడిని పడగొట్టిన అధికారులు… ఆంతర్యమేమి?

Thursday, November 14th, 2019, 04:28:10 PM IST

గుంటూరు జిల్లాలో అధికారులు గుడిని కూల్చేశారు. అయితే ఈ విషయం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం సంచలనం గా మారింది. దేవాలయంలో సమన్లు కూడా తీసే సమయం ఇవ్వకుండా గుడిని కూల్చేశారు అంటూ అక్కడి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డు వద్ద వున్న ఇక్కడి అమ్మవారి గుడి దాదాపు 32 సంవత్సరాల నుండి వుంది. అధికారులు కేవలం ఐదు నిమిషముల సమయం మాత్రమే ఇచ్చారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. రోడ్డు వెడల్పు చేసేందుకు, మరెందుకో తెలీదు కానీ, ఈ విషయంలో మరేదో కారణం ఉందని అక్కడి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సమయం ఇవ్వకుండా, అక్కడి స్థానికుల తో చర్చలు జరపకుండా రాత్రికి రాత్రే గుడిని కూల్చేయడం తో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ ధర్మం ఎక్కడ వుంది అని అక్కడి ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఇక్కడ లేని హిందూ ధర్మం ఇంకెక్కడ ఉందని అన్నారు. గుడి నిర్మాణాన్ని కూల్చివేయడం పట్ల అక్కడి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడి హిందువులు మాత్రం, ఏ చర్చ్ ని, మసీద్ ని ఇలా కూల్చివేయలేదు అని తమ అభిప్రాయాన్ని తెలిపారు.