షాక్‌: ఎగిరొచ్చే ల‌ండ‌న్.. చూశారా ఈ వింత‌!

Wednesday, June 6th, 2018, 11:21:07 AM IST


గాల్లో ఎగిరొచ్చే లండ‌న్ న‌గ‌రాన్ని ఎప్పుడైనా చూశారా? ఏకంగా అంత పెద్ద న‌గ‌రం గాల్లో ఎగిరి వ‌స్తుంది.. ఆ న‌గ‌రానికి ఒక ద్వారం ఉంటుంది. అందులోకి మ‌నుషుల్ని లాగేసుకుంటుంది. ఇదేమైనా ఏలియ‌నా? వింత గ్ర‌హ‌మా? అన్న సందేహం వ‌ల‌దు. ఇదో గ్రాఫిక‌ల్ విజువ‌ల్ వండ‌ర్‌.

ఒంట‌రిగా వెళితే జాగ్ర‌త్త‌! లండ‌న్ న‌గ‌రం త‌న‌లోకి లాగేసుకుంటుంది. మీ ద‌గ్గ‌ర‌కు ఎగిరొచ్చి మ‌రీ ఎత్తుకెళుతుంది. ఇది ఆస‌క్తిక‌ర‌మే కాదు.. ఇలాంటి ఫిక్స‌న్ సినిమాలు తీయ‌డంలో హాలీవుడ్‌ని మించి ఛాన్సే లేదు. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌.. మేక‌ర్స్ న‌యా ప్ర‌యోగం ఇది. హాబిట్ లాంటి స‌క్సెస్‌ఫుల్ సిరీస్‌ని లాంచ్ చేసి, అటుపై ఇప్పుడు ఏకంగా `మోర్ట‌ల్ ఇంజిన్స్‌` పేరుతో మ‌రో ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ 14న ఈ సినిమా రిలీజ‌వుతోంది. త‌ర‌ణ్ ఆద‌ర్శ్ స్వ‌యంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు. ఇప్ప‌టికే ట్రైల‌ర్ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మ‌రో ప్ర‌యోగాత్మ‌క హాలీవుడ్ చిత్రం ఇండియాలో రిలీజ్ కానుంద‌ని 3డి థియేట‌ర్లు కిట‌కిట‌లాడ‌డం ఖాయ‌మ‌ని దీన‌ర్థం.

  •  
  •  
  •  
  •  

Comments