అమ్మో నాని రెమ్యూనరేషన్ అంతా?

Sunday, March 4th, 2018, 11:28:51 AM IST

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న నటుడు నాని. మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఆయన తరువాత మెల్లగా నటనలోకి అడుగుపెట్టారు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం లో ఆయన నటించిన ‘అష్టాచమ్మా’ ఆయన తొలి చిత్రం. తొలి చిత్రమే మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయనకు ఆఫర్ లు వెనువెంటనే వచ్చాయి. అలా మెల్లగా ఒకొక్క మెట్టు ఎదుగుతూ ప్రస్తుతం ఆయన టాలీవుడ్ లో మంచి సక్సెస్ రేట్ వున్నా హీరోగా నిలిచారు.

అందుకే ఆయన చేసే సహజ నటనకు గుర్తుగా అందరూ ఆయన్ని’నేచురల్ స్టార్‌ అంటారు. ప్రస్తుతం ఆయన కృష్ణార్జునయుద్ధం చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఆయనకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో వినబడుతోంది. ప్రస్తుతం తనకున్న సక్సెస్ రేటును దృష్టిలో పెట్టుకుని నాని రెమ్యూనరేషన్‌ను కొంతమేర పెంచారని వార్త అందుతోంది. తన సినిమాలకు ఉన్న మార్కెట్ డిమాండ్‌ వల్ల ఒక్కో సినిమాకు దాదాపు ఆయన రూ.9 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నట్లు సమాచారం.

కొందరు ఆయన డిమాండుని బట్టి తీసుకుంటున్నారు అంటుంటే, మరి కొందరేమో ఆమ్మో మరీ అంతా! అంటున్నారు. నాని ఇదివరకు నటించిన ఎంసీఏ చిత్రం రూ.50 కోట్ల వసూళ్లను సాధించింది. నాని ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసేలా పక్కా ప్లాన్‌ తో ముందుకు వెళ్తున్నారు. కథల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం వల్ల వరుస సక్సెస్‌లు అందుకుంటున్న ఆయన తాజాగా అ! చిత్రం తో నిర్మాత గా మరి మంచి విజయం అందుకున్నారు….