‘ఒక్క క్షణం’ టీజర్ : వెరీ ఇంట్రెస్టింగ్..శిరీష్ గట్టిగా కొట్టేలా ఉన్నాడు..!

Sunday, December 3rd, 2017, 03:25:36 PM IST

అల్లు శిరీష్ మెగా కుటుంబం నుంచి వచ్చినా మిగిలిన మెగా హీరోల స్థాయిలో మెప్పించలేదు. శిరీష్ చివరి చిత్రం శ్రీరస్తు శుభమస్తు ద్వారా మంచి మార్కులు కొట్టేసాడు. తాజాగా ఒక్క క్షణం చిత్రంలో నటిస్తున్నాడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం వస్తోంది. ఉత్కంఠ భరితమైన కథతో ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం ద్వారా ఈ దర్శకుడు విజయాన్ని అందుకున్నాడు. కాగా ఇప్పుడు అల్లు శిరీష్ తో జత కట్టడంతో ఒక్క క్షణం చిత్రంపై ఆసక్తి పెరిగింది.

తాజా ఈ చిత్ర టీజర్ విడుదలయింది. దాదాపు నిమిషం నిడివి ఉన్న టీజర్ లో దర్శకుడు కావలసినంత సస్పెన్స్ అంశాలని జోడించాడు. ఈ ప్రపంచంలో జరిగే కొన్ని సంఘటలను అగ్గిపుల్లలా థీరీ ద్వారా వివరించే ప్రయత్నం చేశాడు. ‘గుప్పెడు అగ్గిపుల్లతో రెండు పార్లల్ గా పడినప్పుడు ఇన్ని కోట్ల మంది ప్రజల్లో ఎంత మంది జీవితాలు పార్లల్ గా ఉంటాయో ఆలోచించండి.. వాళ్ళ ప్రజెంట్ మీ ఫ్యూచర్’ అంటూ నటుడు జయప్రకాశ్ చెప్పే డైలాగులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాలమీదికి వస్తే పేట్ తో అయినా, డెస్టినీ తో అయినా చివరకు చావుతో అయినా పోరాడతా’ అంటూ చివర్లో అల్లు శిరీష్ చెప్పే డైలాగ్ టీజర్ కు హైలైట్ గా నిలిచింది. బ్యాగ్ గ్రౌండ్ సంగీతం ఆకట్టుకుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సురభి, సీరత్ కపూర్ లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments