నాగార్జునకు చిక్కులు తప్పేలా లేవు… స్వామి ?

Sunday, January 29th, 2017, 09:53:19 PM IST

om-namo-venkateshaya
అక్కినేని నాగార్జున హీరోగా కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందుతున్న భక్తి రస చిత్రం ”ఓం నమో వెంకటేశాయ”. వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు హథీరాం బాబా జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే నెల 10 న విడుదలకు సిద్ధం అయిన నేపథ్యంలో ఈ సినిమా పై పెద్ద దుమారమే రేగింది. ఈ సినిమా గిరిజన తెగకు చెందిన హథీరాం బాబా కథతో సినిమా వస్తుంది కాబట్టి ఓం నమో వెంకటేశాయ అనే టైటిల్ కాకుండా హథీరాం బాబ అనే టైటిల్ పెట్టాలంటూ గిరిజన సంఘం నాయకులూ డిమాండ్ చేస్తూ .. ఈ మద్యే ధర్నా కూడా చేసారు. ఎట్టి పరిస్థితుల్లో సినిమా టైటిల్ మార్చాల్సిందే అని వారు పట్టు పట్టారు .. టైటిల్ మార్చకుంటే సినిమా విడుదల అడ్డుకుంటామని అంటున్నారు? అయన కథతో చేస్తున్న సినిమాకు అయన పేరు కాకుండా వేరే పేరు ఎందుకు పెడుతున్నారంటూ గగ్గోలు చేస్తున్నారు. మరి ఈ విషయంలో నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి.