నాగార్జున సినిమాలు ప్లాప్ .. కష్టాల్లో నాగ్

Saturday, February 18th, 2017, 12:18:06 PM IST


ప్రయోగాలు ఒక్కొక్కసారి బెడిసి కొడుతూ ఉంటాయి .. కొత్త దానాన్ని ప్రోత్సహించడం లో భాగంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తన కెరీర్ లో కొత్తదనం ని ప్రోత్సహిస్తూ వస్తున్న నాగార్జున కి కమర్షియల్ గా చాలా ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. ఊపిరి చిత్రానికి ఎంత మంచి పేరు వచ్చినా.. నిర్మాతకు నష్టాలు వచ్చాయన్నది కూడా నిజమే. దాన్ని భర్తీ చేసేందుకే పీవీపీకి రాజుగారిగది2 చేస్తున్నాడన్నది టాక్. అయితే.. ఈ మధ్య వరుసగా అక్కినేని ఫ్యామిలీ సినిమాలు నిరుత్సాహపరుస్తున్నాయి. నాగ్ పై ఉన్న నమ్మకంతో భారీ రేట్లకే ఓం నమో వెంకటేశాయను కొనుగోలు చేశారు డిస్ట్రిబ్యూటర్లు.. బయ్యర్లు. ఈ చిత్రం సేఫ్ జోన్ లోకి రావాలంటే 40 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. ఆ సినిమా కలెక్షన్స్ చూస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదు. టాక్ బాగుండడంతో ఊపందుకుంటుందని అనుకున్నారు కానీ.. మొదటివారం పూర్తయ్యే సరికి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ 5.56 కోట్లు మాత్రమే. మరి డిస్ట్రిబ్యూటర్ లకి డబ్బుల విషయం లో నాగార్జున మీద వత్తిడి పెరుగుతోంది అని తెలుస్తోంది