నాగార్జున క‌న్నీళ్లు పెట్టించాడా?

Tuesday, September 27th, 2016, 02:51:51 PM IST

nagarjuna
టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం భ‌క్తిర‌స చిత్రం అన‌గానే మొట్ట‌మొద‌ట గుర్తుకొచ్చే క‌థానాయ‌కుడు నాగార్జున‌. ఆయనా,రాఘ‌వేంద్ర‌రావు క‌లిశారంటే ఓ అపురూప‌మైన చిత్రం రూపుదిద్దుకొన్న‌ట్టే. అన్న‌మ‌య్య, శ్రీరామ‌దాసు, శిరిడిసాయి చిత్రాల‌న్నీ ఆకోవ‌లోకే చెందుతాయి. మ‌రోసారి తెర‌పై `అన్న‌మ‌య్య` త‌ర‌హా మేజిక్ `ఓం న‌మో వేంక‌టేశాయ‌` రూపంలో క్రియేట్కా నుంద‌ని స‌మాచారం. అందుకు సంబంధించి స్ప‌ష్ట‌మైన సంకేతాలు కూడా వ‌చ్చాయి. కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌ధారిగా తెర‌కెక్కుతున్న చిత్రమే `ఓం న‌మో వేంక‌టేశాయ‌`.ఈ చిత్రం కోసం కీర‌వాణి ఓ పాట‌ని కంపోజ్ చేసి ఇచ్చాడ‌ట‌.కొత్త గాయ‌కుడితో పాడించి రాఘ‌వేంద్ర‌రావుకి ఇవ్వ‌డంతో దాంతోనే పాట తెర‌కెక్కించాడ‌ట.ఆ త‌ర్వాత ఆ విజువ‌ల్స్‌ని చూపిస్తూ అదే పాట‌ని ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం తో పాడించార‌ట‌. ఆ పాట‌ని, అందులో నాగార్జున న‌ట‌న‌ని చూస్తూ బాలు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడ‌ట‌.అద్భుతంగా తీశార‌ని,నాగార్జున న‌ట‌న అద్భుత‌మ‌ని ఎస్పీ బాలు ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావునీ, క‌థానాయ‌కుడు నాగార్జున‌నీ మెచ్చుకొన్నార‌ట‌. బాలులాంటి గాయ‌కుడి నోటి నుంచే ఆ మాట వ‌చ్చిందంటే ఇక అంత‌కంటే ఏం కావాలి? స‌ంక్రాంతికి `అన్న‌మ‌య్య‌`లాంటి మ‌రో అద్భుతాన్ని తెర‌పై చూడ‌బోతున్నామన్న‌మాట‌.

  •  
  •  
  •  
  •  

Comments