చంద్రబాబు పచ్చి అవకాశ వాది – ఒమర్ అబ్దుల్లా!

Thursday, July 30th, 2020, 02:21:29 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రతి పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై జమ్ము కాశ్మీర్ కి చెందిన మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశ వాది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు కోసం తన తండ్రి సొంత ఎన్నికలను కూడా వదులుకొని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కి వచ్చి ఎన్నికల కి ప్రచారం చేశారు అని చెప్పుకొచ్చారు. అయితే తాము హౌజ్ అరెస్ట్ లో ఉండగా చంద్రబాబు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటూ అవేదన వ్యక్తం చేశారు.

అయితే తమ కోసం ఒక్క ప్రకటన కూడా చేయలేదు అని, ఎన్నికల్లో జగన్ క్లీన్ స్వీప్ చేస్తారు అని తెలిసినా కూడా తన తండ్రి ప్రచారం చేశారు అని వ్యాఖ్యానించారు. అయితే బాబు ఓడిపోతారు అన్న విషయం ఒక్క చంద్రబాబు కి తప్ప అందరికీ తెలుసు అని అన్నారు.