29 డిసెంబర్ న తమిళ రాజకీయాలలో పెను మార్పు :

Wednesday, December 28th, 2016, 12:15:31 PM IST

pannerselvam-sasikala
29 డిసెంబర్ కి కి సరిగ్గా రెండే రెండు రోజులు ఉన్న సందర్భంగా తమిళనాడు లో రాజకీయాలు వేడెక్కాయి. దివంగత తమిళ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ త్వరలో ఒక సంచలన ప్రకటన చెయ్యబోతున్నారు అంటూ తమిళనాడు మొత్తం మార్మోగుతోంది. చిన్నమ్మ మేజిక్ చేస్తారనే వాళ్లు ఎందరో.. అంత సీన్ లేదని తేల్చేస్తున్న వాళ్లు అంతే స్థాయిలో ఉండటం ఇప్పుడు ఉత్కంటగా మారింది. ఇంతకీ.. ఈ నెల 29న తమిళనాడులో ఏం జరగనుంది? ఆసుపత్రి లో అనారోగ్యంతో అమ్మ మంచం ఎక్కిన నాటి నుంచే పార్టీ మీద పట్టు కోసం తెర వెనకాల ప్రయత్నాలు చేసిన చిన్నమ్మ తన పని ఆసుపత్రిలోనే పూర్తి చేసుకున్నారు. స్థానిక ఎన్నికలలో అభ్యర్ధుల ఎంపిక దగ్గర నుంచీ చిన్నమ్మ డైరెక్షన్ లో కథ చాలానే నడిచింది. అమ్మ మరణం తర్వాత వ్యూహాత్మకంగా అమ్మ స్థానాన్ని చేజిక్కించుకునే ప్రయత్నంలో ఉన్న చిన్నమ్మ శశికళ.. ఎక్కడా తొందరపడినట్లు కనిపించదు. మనకి అందుతున్న సమాచారం ప్రకారం మరో రెండు రోజుల్లో 29 డిసెంబర్ న తమిళనాడు లో ఈ రకమైన వ్యవహారాలు బయటకి రావచ్చు ..

1 . చిన్నప్ప పార్టీ పదవులకి దూరంగా ఉంటూ ఆరు నెలల్లో ఆర్కే నగర్ ఉప ఎన్నిక కి పోటీ చేసి గెలితి తన సత్తా నీ ప్రజా బలాన్నీ నిరూపించుకునే ప్రయత్నం చెయ్యడం ..

2 ప్రస్తుతానికి పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్చీ ఎక్కేసి తనకి ముఖ్యమంత్రి పదవి మీద వ్యామోహం లేదు అని నిరూపించుకోవడం

3 చిన్నమ్మ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టి.. ఆ పై ముఖ్యమంత్రి పదవిని చేపట్టేలా పావులు కదపటం

  •  
  •  
  •  
  •  

Comments