మరోసారి ఎన్నికలకు సిద్దమవుతున్న పవన్ – ఈసారి ఏమవుతుందో మరి…?

Thursday, June 6th, 2019, 03:20:32 AM IST

మరోసారి ఏపీలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దమవుతున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గతంలో చేసిన తప్పులను మళ్ళీ చేయకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమాల్లో చూపించినట్టు… రైతుకు, పేదవాడికి, స్లీపర్ కు ఇలా చాలామందికి పవన్ టిక్కెట్లు ఇచ్చాడు. సినిమాల్లో హీరో కాబట్టి వాళ్ళను గెలిపించుకుంటాడు. కానీ నిజ జీవితానికి వచ్చేసరికి పవన్ అంచనాలన్నీ తారుమారై గోరమైన ఓటమిని చవిచూశారు. కానీ అనుకున్న విజయం సాధించాలంటే జనాల్లో తిరగాల్సిందే. గ్రామాల్లో బలమైన పునాది ఉండాలి. అప్పుడే పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది.

నేడు అమరావతికి వెళ్లనున్న పవన్, అక్కడున్న అధికారులతో కలిసి తమ ఓటమికి గల కారణాలను కనుక్కునే పనిలో ఉన్నారని, తప్పులను సరిదిద్దుకునే అవకాశంకోసం చూస్తున్నారని సమాచారం. ఆ తరువాత ఆంధ్రపదేశ్ లో త్వరలో జరగబోయే ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో విజయం సాధించే దిశగా జనసేన బలపడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని కూడా చర్చించనున్నారు. అయితే మండల, గ్రామాల్లో బలపడితే.. వచ్చే ఎన్నికల నాటికీ పుంజుకోవచ్చు. వైకాపాకు ప్రత్యామ్నాయంగా ఎదగవచ్చు అన్నది పవన్ ఆలోచన. అందుకే ఎన్ని అవకాశలు వచ్చినా సినిమాలను పక్కన పెట్టేశారు. ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజలకోసం పనిచేసేందుకు సిద్ధం అవుతున్నారు.