బిగ్ బ్రేకింగ్ : భారత్ లో మరోసారి రికార్డ్ బ్రేకింగ్ కేసులు.!

Saturday, June 27th, 2020, 11:37:06 AM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మన దేశంలో కూడా భారీ ఎత్తున వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకు గ్రాఫ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండడంతో ప్రతీరోజు రికార్డు బ్రేకింగ్ కేసులు నమోదు అవుతున్నాయి.

జనం ఏమాత్రం సామాజిక దూరం పాటించడం లేదు ఇష్టమొచ్చినట్టు తిరుగుతుండడంతో కరోనా విలయ తాండవం చేస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరోసారి భారీ ఎత్తున కేసులు భారత్ లో నమోదు అయ్యినట్టుగా నిర్ధారణ అయ్యింది.

ఇది వరకు పదేసి వేలు నుంచి 15 వేలుకు కేసులు వస్తుండగా ఈసారి ఏకంగా 18 వేల 522 కేసులు కేవలం గత 24 గంటల్లో నమోదు అయ్యినట్టుగా వెల్లడి అయ్యింది.

ఇదే ఇప్పుడు మన దగ్గర రికార్డు స్థాయి కేసులు అని చెప్పొచ్చు. ఇప్పటికే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అలాగే కేంద్రం కూడా పెద్దగా కట్టడి చేసే చర్యలు తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.