మరోసారి రోడ్డెక్కి నిరసన చేపట్టిన శ్రీరెడ్డి!

Friday, May 18th, 2018, 10:09:44 PM IST


ఇటీవల కొద్దిరోజుల క్రితం కాస్టింగ్ కౌచ్ విషయమై టాలీవుడ్ కి వచ్చే తెలుగు అమ్మాయిలను పలువురు కో ఆర్డినేటర్లు అవకాశలకోసం వేధిస్తున్నారని నిరసన వ్యక్తం చేసిన శ్రీరెడ్డి తొలుత మా అస్సోసియేషన్ ఛాంబర్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన చేయగా, మా సభ్యులు ఆమెకు మా సభ్యత్వం ఇవ్వనని చెప్పడం, ఆ తర్వాత ఆమె పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టి టివి చానెల్స్ ద్వారా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆ తర్వాత మా సభ్యులు ఆమెను తమ సంఘం లోకి ఆహ్వానిస్తున్నట్లు అలానే ఆమెకు వేషాలు ఇప్పించడానికి ఒప్పుకున్నట్లు తెలిపారు. అయితే తన నిరసనలో భాగంగా నటుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి పలువురి నుండి వ్యతిరేకత ఎదుర్కొన్న శ్రీరెడ్డి కొద్దిరోజులనుండి మౌనం వహించింది.

కాగా గత కొద్దికాలంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం తగ్గించిన ఆమె మళ్లి ఇన్నాళ్లకు రోడ్ పైకి వచ్చి తన నిరసనను వ్యక్తం చేసింది. అయితే ఈ సారి ఆమె చేసిన నిరసన కాస్టింగ్ కౌచ్ పై కాదు, ఉపాధి కూలీల కోసం. ఇక విషయం ఏమిటంటే శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తున్న ఆమె మార్గ మద్యంలో ప్రకాశం జిల్లా గురిజేపల్లి గ్రామం సమీపంలో కొందరు ఉపాధి కూలీలు ప్రభుత్వం తమకు సరైన ఉపాధి చూపించడం లేదని రోడ్ పై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అటుగా వెళ్తున్న శ్రీరెడ్డి వెంటనే కారు దిగి తలపాగా చుట్టుకుని వారికి కాసేపు మద్దతుగా రోడ్ పై బైఠాయించింది. అది చూసిన కూలీలు శ్రీరెడ్డి మాకెందుకు మద్దతు తెలుపుతుంది అని నిర్ఘాంతపోయారు. కాసేపు కూలీలతో ముచ్చటించిన ఆమె కొద్దిసేపటి తర్వాత తన కారులో శ్రీశైలం పయనమైంది. ఇది అన్నమాట శ్రీరెడ్డి రోడ్ అపి బైఠాయించడం వెనుక వున్న అసలు మ్యాటర్……

  •  
  •  
  •  
  •  

Comments