ఇంతోటి కథకోసం.. కోటి రూపాయలా ?

Saturday, February 3rd, 2018, 11:52:33 AM IST

ఈ మధ్య మంచి కథలు ఉంటె తప్పా జనాలు థియేటర్ కు రావడం లేదు. అందుకే .. కోట్లు పెట్టి మరి కథలను కొంటున్నారు దర్శక నిర్మాతలు. ఇక స్టార్ రైటర్ కు అయితే తిరుగే లేదు .. అయన కథలకు భారీ డిమాండ్. తాజాగా ఓ సినిమా కథ కోసం ఏకంగా కోటి రూపాయలు పెట్టి కొని సినిమా తీశారు .. తీరా విడుదలైన ఆ సినిమా భారీ డిసాస్టర్ ని మూట కట్టుకోవడంతో ఇంతోటి కథకు కోటి రూపాయలా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. స్టార్ రైటర్ గా వక్కంతం వంశీ కి మంచి క్రేజ్ ఉంది. రైటర్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న వంశీ నా పేరు సూర్య తో దర్శకుడిగా మారాడు. అయితే వక్కంతం వంశీ అందించిన కథతో రవితేజ టచ్ చేసి చూడు చిత్రాన్ని చేసాడు. కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ కథకోసం ఏకంగా కోటి రూపాయలు చెల్లించారట నిర్మాతలు. ఈ సినిమా చుసిన వాళ్లంతా ఓస్ .. ఇంతోటి కథకు అంతనా అంటూ షాక్ అవుతున్నారు. రవితేజ పోలీస్ గా ఏమాత్రం ఆకట్టుకోలేదని ప్రేక్షకులు చెబుతున్నారు.