జిగేల్ రాణీ సింగ‌ర్‌కి ల‌క్ష పారితోషికం

Sunday, July 22nd, 2018, 01:11:10 PM IST

రామ్‌చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం చిత్రంలో జిగేల్‌రాణీ ఐటెమ్ నంబ‌ర్ ఎంత పెద్ద స‌క్సెసైందో తెలిసిందే. ముంబై బ్యూటీ పూజా హెగ్డే ఈ పాట‌లో న‌ర్తించింది. ఐదు నిమిషాల సాంగ్‌లో న‌ర్తించినందుకు పూజాకి 50ల‌క్ష‌లు చెల్లించార‌ని ప్ర‌చార‌మైంది. అదంతా అటుంచితే ఆ పాట పాడిన సింగ‌ర్‌కి మాత్రం అన్యాయం జ‌రిగిందంటూ ఇటీవ‌ల మీడియాలో క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది.

ఇంత పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్ పాడిన వెంక‌ట‌ల‌క్ష్మీ అనే గాయ‌నికి సింగిల్ పెన్నీ కూడా నిర్మాత‌లు ఇవ్వ‌లేద‌ని మీడియాలో వార్త హోరెత్తిపోవ‌డంతో ఆ నోటా ఈనోటా అది ద‌ర్శ‌కుడు సుకుమార్ చెవిన ప‌డిందిట‌. అంతే ఇలా విన్నాడో లేదో అలా వెంట‌నే స్పందించి స‌ద‌రు సింగ‌ర్‌కి రూ.ల‌క్ష పారితోషికం చెల్లించాడ‌ట‌. వాస్త‌వానికి ఎంత పెద్ద హిట్ సాంగ్ పాడినా, స్టార్ సింగ‌ర్ సైతం ఇంత పెద్ద పారితోషికం అందుకోలేదు. అలాంటిది ఒక్క పాట‌కు స‌ద‌రు గాయ‌ణీమ‌ని ఇంత పెద్ద పారితోషికం అందుకోవ‌డం హాట్ టాపిక్ అయ్యింది. అయితే అంత మంచి పాట పాడించుకుని పైసా కూడా పారితోషికం ఇవ్వ‌క‌పోవ‌డ‌మేంటో .. అన్యాయం అన్న వాద‌నా వినిపిస్తోంది. సుక్కూ యాక్ట్‌కి ప్ర‌స్తుతం ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments