ఓ వ్యక్తి తనను పెళ్ళిచేసుకోవాలని కిడ్నాప్ చేసాడు : నటి నమిత

Sunday, January 14th, 2018, 02:31:27 AM IST

సినీ నటి నమిత ఒక షో లో పాల్గొనే నిమిత్తం 2009, అక్టోబర్తి 23 న తిరుచ్చి బయల్దేరి వెళ్లారట, అయితే విమాన మార్గం ద్వారా ఎయిర్పోర్ట్ కి తాను, తన మేనేజర్ జాన్ చేరుకొని, బయటకి వచ్చి కార్ కోసం వెయిట్ చేస్తుంటే, ఒక వ్యక్తి వచ్చి మేడం నేను మీ కార్ డ్రైవర్ ని చెప్పడం తో అతని కార్ ఎక్కామని చెప్పారు. అయితే అప్పుడు తాను చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నానని, మేనేజరేమో తనకి వస్తున్న ఫోన్లు మాట్లాడాతూన్నాడని, ఆ హడావుడిలో కార్ ఎక్కేశామని, అయితే కొంత దూరంవెళ్లాక మేనేజర్ తాము తప్పు దారిలో వెళ్తున్నామని తెలిసి షో నిర్వాహకునికి మెసేజ్ చేయగా, అతను మీకోసం డ్రైవర్ ఎయిర్పోర్ట్ బయటే వెయిట్ చేస్తున్నట్లు చెప్పాడట. దానికి జాన్ బదులిస్తూ మేము ఎప్పుడో కారెక్కాము, అది బయల్దేరి చాలాసేపు అయిందనగానే ఆ షో నిర్వాహకునికి ఆశ్చర్యం వేసిందట.

వెనువెంటనే మా కార్ చుట్టూ దాదాపు ఆరేడు కార్లు మమ్మల్ని వెంబడించసాగాయన్నారు. ఒకసారి కార్ అద్ధం వైపు చూస్తే డ్రైవర్, డ్రైవింగ్ మీద దృష్టిపెట్టకుండా తనవైపు చూసి నవ్వుతున్నట్లు గ్రహించానని చెప్పారు, ఏదో కుర్రాడు కదా సంతోషంగా స్వర్గంలో ఉన్నట్లు ఫీల్ అవుతున్నాడులే అని పెద్దగా పట్టించుకోలేదని, అయితే తరువాత అసలు విషయం తెలిసిందని తనను ఒక గోడౌనుకు తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకోవాలనేది తన ప్లాన్ అని చెప్పుకొచ్చారు. అయితే సడన్ గా కార్ ఆపేయడం, వెంటనే కొంతమంది మహిళా పోలీసులు తనను బయటకు లాగి వేరే కార్ ఎక్కించడంతో ఆశ్చర్యపోయానన్నారు. ఏమి జరిగిందని జాన్ ని ప్రశ్నిస్తే, మేడం మీరు కిడ్నప్ అయ్యారు అని చెప్పగానే, తనకి నవ్వు వచ్చిందని, తాను అలా పగలపడి నవ్వుతుంటే జాన్ వణికిపోయాడన్నారు. మేనేజర్ జాన్ షో నిర్వాహకుడికి మెసేజ్ చేసినవెంటనే ఆయన అప్రమత్తమై పోలీసులను తీసుకురావడంతో తాను ఆ కిడ్నప్ నుండి బయటపడగలిగానని ఆమె గుర్తుచేసుకున్నారు…