కరోనా టెర్రర్…ఏపీ లోని ఆ ప్రాంతం లో వారం రోజుల లాక్ డౌన్!

Sunday, July 12th, 2020, 08:37:21 PM IST

కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలు సైతం దీని భారిన పడి తీవ్ర స్థాయిలో అన్ని రంగాల్లో నష్టాలను చవి చూస్తోంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒక్క రోజులో నే 1,933 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం తో వైరస్ ఏ స్థాయిలో తమ ప్రభావం చూపుతుందో చెప్పవచ్చు.

అయితే విజయవాడ లోని హోల్సేల్ మార్కెట్ అయిన గొల్లపూడి హోల్సేల్ మార్కెట్ ను వారం రోజుల పాటు లాక్ డౌన్ లో ఉంచనున్నారు. అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎన్నో పాజిటివ్ కేసులు ఇక్కడ నమోదు అవుతున్నాయి. స్థానిక ప్రాంతాల్లో మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల కు సైతం ఇక్కడినుండి భారీగా ఎగుమతి, దిగుమతులు ఉండటం మరింత ప్రమాదకరం గా భావించడం జరిగింది. అయితే ఈ నెల 18 వరకు ఇక్కడ లాక్ డౌన్ అమలు అయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ మార్కెట్ పై ఆధారపడిన ఇతర మార్కెట్ ల పై దీని ప్రభావం ఉంటుంది అని కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.