ఆ ఒక్కడు జనసేనానిని ఎంత వరకు కాపాడగలడు?

Monday, June 10th, 2019, 06:01:00 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటమిని అధిగమించి మళ్ళీ ప్రజల్లోకి రావడానికి కాస్త తక్కువ సమయాన్నే తీసుకున్నారు.ఇక మళ్ళీ ప్రజల మధ్యలోకే వచ్చేసి తన పనుల్లో నిమగ్నమై ఉన్నారు.బయటకు రావడంతోనే పవన్ కళ్యాణ్ తనలో ఉన్న ఆగ్రహాన్ని ఆవేదనని వెళ్లగక్కుతూ చాలా అగ్రెసివ్ గా మళ్ళీ స్పీచ్ లు ఇస్తూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.ఇదిలా ఉండగా పవన్ కు మాత్రం రానున్న రోజుల్లో గడ్డుకాలం తప్పదని సదరు అభిమానులే అంటున్నారు.ఎందుకంటే పవన్ కు ఇతర పార్టీలలా మద్దతు ఇచ్చే పేపర్లు కానీ మీడియా చానెళ్లు కానీ లేవని అందువల్ల పవన్ పై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఇలాంటి సమయంలో పవన్ కు ఆర్ధికంగా సహాయం చేసి పార్టీకోసం ఒక ప్రత్యేక ఛానెల్ ను స్థాపించే వారు ఒక్కరే ఉన్నారని జనసేన శ్రేణులు అనుకుంటున్నారు.అతడే రామ్ చరణ్.చరణ్ కు పవన్ అంటే ఎంతటి ప్రేమో అందరికీ తెలుసు,అందువల్ల పవన్ కు రానున్న రోజుల్లో సపోర్టివ్ గా ఉండేందుకు రామ్ చరణ్ ఒక ప్రత్యేక ఛానెల్ పెట్టిస్తే బాగుంటుందని అలాంటప్పుడు ప్రజల్లోకి పార్టీకోసం బలంగా తీసుకెళ్లగలిగిన వాళ్ళం అవుతామని వీరు అనుకుంటున్నారు.అయితే ఇది గ్రౌండ్ లెవెల్లో మాత్రం సాధ్యమయ్యే పనా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి.

ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజలంతా కేవలం కొన్ని చానెళ్లకు మాత్రమే అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు.వీరు అట్టహాసంగా ఒక కొత్త ఛానెల్ పెట్టినా కూడా అరకొరగా చూడడం తప్ప మళ్ళీ ముందు ఛానెళ్ల దగ్గరకే వస్తారు.అంతెందుకు చాలా మంది పవన్ అభిమానుల్లో కూడా అసలు ఛానెల్ తప్ప మిగతా ఛానెల్స్ చూసే వాళ్ళు కూడా ఉండే ఉంటారు.అందువల్ల రామ్ చరణ్ వచ్చి అండగా నిలబడి ఒక కొత్త ఛానెల్ పెట్టినా సరే అది పవన్ కు ఇప్పుడప్పుడే ప్లస్ అయ్యే అవకాశం లేదని విశ్లేషకులు అంచానా వేస్తున్నారు.