జగన్ పై పదకొండో చార్జ్ షీట్

Tuesday, September 9th, 2014, 04:29:34 PM IST


అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణపై సిబీఐ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై పదకొండో చార్జ్ షీట్ ను ఈ రోజు సీబీఐ ప్రత్యేక న్యాయస్తానంలో దాఖలు చేసింది. ఇందు గృహనిర్మాణ ప్రాజెక్టులో అవకతవకలపై సిబీఐ జగన్ తో పాటు విజయసాయిరెడ్డి,శ్యాంప్రసాద్ రెడ్డితో కలిపి మొత్తం 14 మంది పేర్లను ఈ చార్జ్ షీట్ లో పేర్కొంది. వైఎస్ హయాంలో కుకట్ పల్లి, గచ్చిబౌలి, నాగోలు మరియు నంద్యాలలో నాలుగు ప్రాజెక్టులను ఇందు గృహనిర్మాణ సంస్థకు అప్పగించారు. ఈ ప్రాజెక్టుకోసం ఇందు సంస్థ 70 కోట్లు వెచ్చిందింది. తక్కువ మొత్తానికే ప్రాజెక్టులను ఆ సంస్థకు అప్పగించారని, ఇందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీలలో ఇందు సంస్థ పెట్టుబడులు పెట్టిందని సిసీఐ ఆరోపించింది.