ట్రైలర్ : ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు

Friday, May 25th, 2018, 10:45:34 AM IST

టాలీవుడ్ లో ఆపరేషన్ దుర్యోధన సినిమా ఒక ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. పోసాని కృష్ణ మురళి దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా 2007లో వచ్చిన ఆ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుకొంది. అయితే ఇప్పుడు కరణం బాబ్జి దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా అదే తరహాలో ఉండే ఆపరేషన్ 2019 అనే సినిమా రానుంది. 2019 ఎలక్షన్స్ ని టార్గెట్ చేస్తున్నట్టు టైటిల్ చూస్తుంటేనే అర్ధమవుతోంది. ఇక ట్రైలర్ తో అయితే రాజకీయాల ప్రస్తావన గట్టిగా ఉందని తెలిసిపోయింది.

బివేర్ ఆఫ్ పబ్లిక్ అనే ట్యాగ్ లైన్ ఓటర్లను పాయింట్ అవుట్ చేసినట్లు అనిపిస్తోంది. ఇక శ్రీకాంత్ చెప్పిన ఒక డైలాగ్ సినిమాపై అంచనాలను గట్టిగా పెంచేసింది. గాంధీ కడుపున గాంధీ పుట్టడు, ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు… ఎవరైనా ప్రజల్లో నుండి పుట్టుకురావాల్సిందే. వివిధ రూపాల్లో వివిధ పేర్లతో సమ్ ఆర్ కమింగ్ సమ్ ఆర్ గోయింగ్ అంటూ పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ చెప్పిన విధానం ఆకట్టుకుంది. మరి ఈ సినిమా ఆపరేషన్ దుర్యోధన స్థాయిలో హిట్ అవుతుందో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments