బిగ్ బ్రేకింగ్ : మరో సంచలన ట్విస్ట్ ఇచ్చిన “ఆపరేషన్ గరుడ” సృష్టికర్త!

Monday, June 10th, 2019, 12:23:46 PM IST

గత ఏడాది సినీ నటుడు కం రాజకీయాల్లోకి వచ్చిన శివాజీ “ఆపరేషన్ గరుడ” అంటూ ఎంతటి సంచలనానికి దారి తీసాడో అందరికీ తెలిసిందే.ఒక అరగంట పాటు ఏదేదో చెప్పి అప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాడు శివాజీ.ఆ తర్వాత కూడా అతను చెప్పినట్టుగానే కొన్ని అవాంఛనీయ సంచలన సంఘటనలు చోటు చేసుకోడం వంటివి ఇతను చెప్పినవి నిజమేనా అన్న అనుమానాలు కలిగించాయి.కానీ అతను మాత్రం ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడన్న వార్త బయటకు రావడంతో ఇతర పార్టీల శ్రేణులు లైట్ తీసుకున్నారు.

కానీ ఆ తర్వాత మళ్ళీ టీవీ9 రవిప్రకాష్ విషయంలో బయటకొచ్చిన కేసుల వివాదంలో ఇతనికి కూడా ఒక భాగముంది అని తెలిసిన ఘటన వీరిపై మరిన్ని విమర్శలకు దారి తీసింది.అప్పట్లో ఈ ఇద్దరు పరారీలో ఉన్నారన్న వార్త గట్టిగా వినిపించడంతో ఓ వీడియో ద్వారా శివాజీ ఎక్కడ నుంచో మాట్లాడుతూ తనకి వడదెబ్బ తగిలిందని అందుకే బయటకు రాలేకపోతున్నా తప్ప ఎవ్వరికి భయపడేది లేదు అంటూ గాంభీర్యం చూపించారు.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పుడు శివాజీ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడని తెలుస్తుంది.

అతడు తిరుపతిలో గుండు కొట్టించుకుని ఏదో మొక్కు తీర్చుకుంటానని చెప్పి పోలీసులు గుర్తు పట్టకుండా ఉండేందుకు ప్లాన్ వేసుకున్నాడని అందుకే అప్పుడు అతను పోలీసుల దగ్గర తప్పక హాజరవుతాని చెప్పి ఇప్పుడు పరారీలో ఉన్నాడని తెలుస్తుంది.అంతేకాకుండా అతను ప్రస్తుతం అయితే మన దేశంలో కూడా లేడని వేరే దేశానికి ఇక్కడ మస్కా కొట్టి చెక్కేసాడని కూడా మరికొందరు అంటున్నారు మరి ఈ ఆపరేషన్ గరుడ సృష్టి కర్తను పోలీసులు పెట్టుకుంటారో లేదో చూడాలి.