బిగ్ బ్రేకింగ్ : ప్రత్యర్థ పార్టీ అభిమానులతోనే భేష్ అనిపించుకుంటున్న జగన్.!

Wednesday, June 5th, 2019, 05:18:51 PM IST

వైఎస్సార్సీపీ అధినేత జగన్ తన ఇప్పుడు ఆరు నెలల్లో కాదు ఆరు రోజుల్లోనే మంచి సీఎం గా మారిపోయారని ప్రత్యర్ధ పార్టీల యొక్క అభిమానులు సైతం అంటున్నారు.ఈ సారి ఎన్నికల్లో జగన్ తన ప్రభంజనం చూపించి రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని విజయాన్ని అందుకున్నారు.తాను ముందు నుంచి చెప్తున్నట్టుగానే కేవలం ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని మాటిచ్చారు.అందుకు తగ్గట్టుగానే జగన్ ఇప్పటి నుంచే రాష్ట్రంలో తన ముఖ్యమంత్రి హోదాలో కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు ప్రత్యర్ధ పార్టీల యొక్క అభిమానులు నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

జగన్ అవినీతిని అంతం చేస్తానని ముందు నుంచి చెప్పుకొస్తున్నారు.దీనిపై చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ల్స్ వేసినా జగన్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు.పోలవరం మరియు రాజధాని అమరావతి విషయంలో జరిగిన అవినీతి గుట్టు కూడా రాబడతానని ఆ పనులపై పావులు కడుపుతుండగా సోషల్ మీడియా ప్రజానీకం జగన్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.జగన్ ఇలా ముందు ముందు కూడా మంచి పనులు చేస్తూ పోవాలని ఇలా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రానికి ఇంకా మంచి జారుతుందని వారు జగన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.