లిరికల్ వీడియో : “రంగస్థలం”లో ఓరయ్యో నా అయ్యా పాట

Tuesday, April 3rd, 2018, 06:00:00 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్ గా వెరైటీ చిత్రాల దర్శకులు సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన లేటెస్ట్ సినిమా “రంగస్థలం”. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా ప్రతి చోట సూపర్ హిట్ టాక్ తో దూసుకువెళుతోంది. యూఎస్ లో అయితే ఇప్పటికే 2.4 మిలియన్ల సాధించిన ఈ సినిమా సునాయాసంగా 3 మిలియన్లను దాటేసే అవకాశం కనపడుతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఒక్క పాట వీక్షకులను అలరిస్తోంది.

అసలు మొత్తం ఆడియోలో ఆరు పాటలంటే, యూనిట్ ఐదు పాటలు మాత్రమే విడుదల చేసింది. ఆఖరి ఆరవ పాటని సినిమా రిలీజ్ తర్వాత విడుదల చేస్తామని సుకుమార్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే సినిమా మంచి విజయం అందుకుని, అన్ని పాటలకు విజువల్ గా కూడా మంచి స్పందన రావడం, అందులో మరీ ముఖ్యంగా సినిమాలో ఒక విషాద సందర్భంలో వచ్చే ఈ ఆఖరి ‘ఓరయ్యో నా అయ్యా’ అనే పాటకు ప్రేక్షకులు మరింత కనెక్ట్ అవడం జరుగుతోంది.

ఈ పాట వింటున్నంతసేపు ప్రతిఒక్కరికి కళ్ళు చమర్చాక మానవు. అంతటి హృదయ విదారకమయిన ఈ పాటని రాసింది మరియు పాడిందికూడా పాటల రచయిత చంద్రబోస్ కావడం విశేషం. ఐతే ప్రస్తుతం యూనిట్ ఈ పాటను నేడు విడుదల చేసింది. యూట్యూబ్ లో విడుదలయినప్పటినుండి ఈ పాట, సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. హృదయానికి హత్తుకునే ఆ గీతాన్ని మీరు కూడా వినేయండి మరి!

  •  
  •  
  •  
  •  

Comments