ఆస్కార్’ పండగ మొదలైంది!

Monday, February 23rd, 2015, 11:04:46 AM IST


ప్రపంచ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ హాలీవుడ్ డాల్బీ థియేటర్ లో అంగరంగ వైభవంగా మొదలైంది. కాగా ప్రస్తుతం అవార్డుల ప్రదానం జరుగుతున్న ఈ వేడుకలో ఉత్తమ సహాయ నటుడిగా ‘విప్లాష్’ చిత్రంలో నటనకు గాను 60ఏళ్ళ జేకే సిమ్సన్ అవార్డు అందుకున్నారు. ఇక హాలీవుడ్ తారల హంగామాతో మొదలైన 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా పోలాండ్ దేశానికి చెందిన ‘ఐడా’, ఉత్తమ లైవ్ యాక్షన్ లఘు చిత్రంగా ‘ది ఫోన్ కాల్’ , ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ‘వెటరన్ ప్రెస్ 1’, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా మలోనా, ఉత్తమ సహాయ నటిగా బాయ్ హుడ్ చిత్రంలో నటించిన పెట్రిసియా ఆర్వైడ్, ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ గాను ‘అమెరికన్ స్నైపర్’ చిత్రం మొదలగువాటికి అవార్డులు దక్కాయి. కాగా ఇంకా ఆస్కార్ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం మనోరంజకంగా కొనసాగుతోంది.