బాహుబలి రేంజ్ అంతేనా? చిన్న సినిమాతో పోటీపడలేక!

Sunday, September 24th, 2017, 06:41:39 PM IST

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో ఆల్ ఇండియా స్థాయిలో ప్రభాస్ పేరు మార్మోగిపోతే, ఇక ఆ సిరీస్ వలన ప్రొడ్యూసర్స్ ఏకంగా 2000 కోట్లు వరకు కలెక్షన్ చేసారు. ప్రపంచ స్థాయిలోనే అత్యధిక కలెక్షన్స్ సంపాదించిన సినిమాలో దబాంగ్ తర్వాత బాహుబలి నిలిచింది. ఇక ఈ సినిమా గురించి చెబుతూ ఇండియా నుంచి వచ్చిన మొదటి ప్రపంచ స్థాయి చిత్రంగా అందరు కీర్తించడం. రాజమౌళి సృష్టి అద్బుతం అని పోగిడేయడం జరిగింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఘనత ఈ సినిమాకి దక్కిందని అందరు కొనియాడారు. అయితే ఈ సినిమా ఇండియా నుంచి ఆస్కార్ బరిలోకి మాత్రం వెళ్ళలేకపోయింది. గతంలో బాహుబలి మొదటి భాగం కూడా ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్ పొందలేకపోతే ఇప్పుడు బాహుబలి 2 కూడా ఆస్కార్ నామినేషన్ టీంని మెప్పించలేకపోయింది. చిన్న సినిమాలతో పోటీ పడలేక రాజమౌళి సృష్టి దారుణంగా దెబ్బతింది.

గత ఏడాది బాహుబలి సినిమాని కాదని విసారనై అనే తమిళ సినిమా ఆస్కార్ ఎంట్రీ సొంతం చేసుకుంది. మరల ఈ సారి కూడా బాహుబలి 2 ఆస్కార్ నామినేషన్ కోసం పోటీ పడింది. అయితే నామినేషన్ సభ్యుల బృందం ఈ సినిమాని కాదని రాజ్ కుమార్ రావు నటించిన న్యూటన్ అనే చిన్న చిత్రాన్ని ఎంపిక చేసారు. అయితే దంగల్ సినిమా కూడా ఈ ఆస్కార్ సభ్యులని మెప్పించలేకపోవడం గమనార్హం. దీంతో అన్ని వేళ కోట్లు సంపాదించి ఇండియన్ సినిమాకి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన సినిమాని ఆస్కార్ నామినేషన్ బృందాన్ని మెప్పించలేకపోయవడం అంటే నిజంగా మనకి అవమానకరం అనే చెప్పాలి. అయితే ఈ విషయంపై దర్శకుడు రాజమౌళి ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం గమనార్హం.

  •  
  •  
  •  
  •  

Comments