ఏపీ రాజకీయాల్లో ఈ అద్భుత ఘనత మాత్రం జనసేనుడిదే.!

Sunday, July 14th, 2019, 11:20:42 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను మొట్టమొదటి సారి పోటీ చేసిన ఎన్నిక లోనే దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఓటమి నుంచి బయటకు రావడనికి పవన్ కు కేవలం 15 నిమిషాలే టైం పట్టినా కొంతమంది పవన్ అభిమానులకు మాత్రం ఇంకా టైం సరిపోలేదు.ఇప్పటి వరకూ ఉన్న రాజకీయాలు కాదు ఒక సరికొత్త రాజకీయాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పరిచయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఒక్క సీటును కూడా అమ్ముకోకుండా పవన్ ఒక సరికొత్త ఒరవడికి నాంధి పలికారు.

అలాగే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ ఒక సరికొత్త రాజకీయాన్ని చేస్తానని ఎలాంటి ధన ప్రవాహం కానీ మధ్య ప్రవాహం కానీ చెయ్యకుండానే 20 లక్షలకు పైగా ఓట్లు సంపాదించి మార్పును కోరుకునే వారు నిజాయితీ కలవారు మా వెంట ఇంత మంది ఉన్నారని గర్వంగా చెప్పుకుంటున్నారు.అయితే పవన్ తీస్కున్నటువంటి ఈ సంచలనాత్మక నిర్ణయాలే ఇతర పార్టీలకు ఓట్లు వేసిన వారి నుంచి కూడా ప్రశంసలను అందుకునేలా చేసింది.

పవన్ నిలబెట్టిన అభ్యర్థులు ఓడిపోయినా సరే ఎలాంటి డబ్బులు కానీ మందు కానీ పంచకుండానే వేలల్లో వేలల్లో ఓట్లు సంపాదించుకునే వారు ఉన్నారని ఏ అరుగు మీద కూర్చొని రాజకీయాలు మాట్లాడే పెద్దలు కానీ రైలు ప్రయాణం చేసేప్పుడు మాట కలిపే సీనియర్ సిటిజన్స్ కానీ మాట్లాడుకుంటున్నారు.జీరో బడ్జెట్ పాలిటిక్స్ ను అమలు పరచడంలో మాత్రం పవన్ విజయం సాధించారని అంటున్నారు.కేవలం ఇదొక్క విషయం మాత్రమే కాదు అసలు విషయం ఇప్పుడు ఉంది.

ఆడుతూ పాడుతూ జీవనం సాగించే యువతకు రాజకీయాలను పరిచయం చేసిన ఏకైక నాయకుడు కూడా పవన్ కళ్యాణే అని కూడా మరో కితాబు ఇస్తున్నారు.ఈ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత రాజకీయాల కోసం ఇంతలా మాట్లాడుకుంటున్నారు అంటే దానికి కారణం మాత్రం పవన్ కళ్యాణే అని ఈ ఘనత పవన్ కే చెల్లుతుందని పవన్ రాబోయే రోజుల్లో కూడా ఉంటే మంచి భవిష్యత్తు తప్పకుండా ఉంటుందని ఇతర పార్టీలకు ఓట్లు వేసిన వారే మాట్లాడుకుంటున్నారు.