శ్రీరెడ్డి కి మద్దతు ప్రకటించిన ఓయూ జెఎసి ?

Thursday, April 12th, 2018, 11:55:22 AM IST

టాలీవుడ్ లో తన కామెంట్స్ తో సంచలనం రేపుతున్న శ్రీరెడ్డి కి ఉస్మానియా విద్యార్థుల జె ఏసీ తమ మద్దతు ప్రకటించింది. సినిమా రంగంలో అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ కు గురవుతున్నారంటూ ఇటీవలే నగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి ని మా అసోసియేషన్ తీవ్రంగా కండించింది. శ్రీ రెడ్డి చర్యలను కండిస్తూ ఆమె మా సభ్యత్వాన్ని రద్దు చేసారు. ఈ నేపథ్యంలో శ్రీ రెడ్డి హైద్రాబాద్ లో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కి వెళ్ళింది. ఆ తరువాత విద్యార్థి సంఘాల నాయకులను కలిసిన శ్రీరెడ్డి అనంతరం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా శ్రీ రెడ్డి స్పందిస్తూ .. ఒక అమ్మాయి ఏడిస్తే ఎవరు ఊరుకోరని ఉస్మానియా విద్యార్థులు నిరూపిస్తున్నారని పేర్కొంది. పరిశ్రమలో తనలాంటి వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుందని ఆమె తెలిపింది. ఈ సందర్బంగా మా నిర్ణయం కూడా అన్యాయమే అని పేర్కొంది. ఈ కార్యక్రమాల్లో జె ఏసీ నాయకులూ మాట్లాడూతూ మా అసోసియేషన్ కొన్ని కుటుంబాలకు , కులాలకే పరిమితమై వారికే అవకాశాలు ఇస్తుందని అన్నారు.