ఉసేన్ బోల్ట్ నే తలదన్ని వైరల్ అవుతున్న మన భారతీయుడు.!

Saturday, February 15th, 2020, 02:14:50 PM IST

ఈ ప్రపంచంలో ఉసేన్ బోల్ట్ అంటే తెలీని వారు చాలా చాలా తక్కువ మందే ఉంటారని చెప్పాలి.పరుగు పందెంలో చిరుత లాంటి వేగంతో ఎన్నెన్నో రికార్డులు రివార్డులు అందుకొని జమైకా చిరుతగా మారి రన్నింగ్ అంటే మొట్టమొదటగా గుర్తుకొచ్చే పేరులా మారిపోయాడు.అలా ఉసేన్ బోల్ట్ ఖాతాలో అనేక వరల్డ్ రికార్డులు కూడా ఉన్నాయి.100 మీటర్ల రన్నింగ్ రేస్ లో ఉసేన్ బోల్ట్ పేరిట 9.58 సెకన్ల ఆల్ టైం రికార్డు ఉంది కానీ ఈ రికార్డును మన దేశానికి చెందిన ఒక సామాన్య వ్యక్తి తలదన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.

దక్షిణ కన్నడ రాష్ట్రంలోని మూడబిద్రి ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల శ్రీనివాస గౌడ అనే వ్యక్తి వారి ప్రాంతంలో జరిగే ఎడ్ల పందెంలో కనబర్చిన ప్రతిభా తీరును చూసి ఔరా..! అంటున్నారు.142.5 మీటర్ల దూరాన్ని కేవలం 13.62 సెకండ్లలోనే పూర్తి చేసేశాడని ఇందులో 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకండ్ల వ్యవధిలో పూర్తి చేసి ఉసేన్ బోల్ట్ ను మించిపోయాడని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.ఈ విషయం తెలిసిన వారు బోల్ట్ వేగాన్ని అందుకోవడమే అత్యంత కష్టం అయితే అందులోను నీటితో ఉన్న వరి భూమిపై ఈ ఫీట్ సాధించడం చాలా గ్రేట్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.