హైదరాబాద్ లో దారుణం : ప్రియుడి కోసం గొంతు కోసుకున్న యువతి

Sunday, February 9th, 2020, 12:58:24 AM IST

హైదరాబాద్ నడి ఒడ్డున జూబ్లిహిల్స్‌ ప్రాంతంలో కొద్దీ సేపటి క్రితం ఒక దారుణం జరిగింది. తనని ప్రేమించిన ఒక యువకుడు తనని మోసం చేశాడనే ఆవేదనతో జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ఒక యువతీ ఒక బ్లేడ్ తో తన గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండే స్వప్న అనే ఒక యువతికి టిక్ టాక్ లో ఒక యువకుడు పరిచయం అయ్యాడు. చివరికి వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. చివరికి ఆ యువకుడు తనని మోసం చేసాడని గుర్తించిన యువతి ఒక సెల్ఫీ వీడియో ని రికార్డు చేసి, ఆ తరువాత బ్లేడ్ తో తన గొంతు కోసుకుంది.

అయితే ఈ విషయాన్నీ గుర్తించిన పలువురు స్థానికులు తక్షణమే స్వప్న అనే బాధితురాలిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే సదరు యువకుడికి సంబందించిన వివరాలేవీ తెలియలేదు. ప్రస్తుతానికి పోలీసులు ఆ యువకుడికోసం గాలిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆ యువతి ఆరోగ్యం విషమంగా ఉందని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.