ఎన్టీఆర్ సినిమాకు…ఫ్యాన్సీ డీల్ ?

Thursday, May 24th, 2018, 10:56:54 AM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రం దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజగా విడుదలైన ఫస్ట్ లుక్ మంచి ఇంపాక్ట్ నింపింది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమాకు బిజినెస్ పరంగా భారీ క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓవర్ సీస్ లో కూడా ఎన్టీఆర్ సినిమాకు క్రేజీ బిజినెస్ జరిగింది. ఈ సినిమా హక్కులను ఏకంగా 11 కోట్లకు తీసుకుంది బ్లూ స్కై సినిమాస్ సంస్థ. ఎన్టీఆర్ కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ ప్రైస్. ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా ఓవర్ సీస్ హక్కులు 8. 5 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ రేంజ్ లో ఎన్టీఆర్ మార్కెట్ పెరగడంతో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి మరి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హారికా హాసిని బ్యానర్ నిర్మిస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments