పద్మావత్ పై ఓవైసీ షాకింగ్ కామెంట్స్ !

Friday, January 19th, 2018, 03:44:18 PM IST

దీపికా పదుకొనె నటించిన పద్మావత్ చిత్ర వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ ధార్మిక సంఘాలు, పలువురు రాజకీయ నేతలు ఈ చిత్రం పై డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. తెలంగాణలో సైతం రాజా సింగ్ వంటి బిజెపి నేతలు సినిమా విడుదలైతే థియేటర్లు సైతం తగల బెడుతామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా ముస్లిం నేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా పద్మావత్ కు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.

పద్మావత్ ని ఓవైసీ ఓ అశ్లీల చిత్రంగా అభివర్ణించారు. ముస్లింలు ఎవరూ ఆ చిత్రాన్ని చూడవద్దని పిలుపునిచ్చారు. పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీల కథ అని కట్టుకథ తీసారని అన్నారు. ఈ సినిమాని చూసి ఎవరూ వారి సమయాన్ని డబ్బుని వృధా చేసుకోవద్దని చెబుతున్నారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై ఒవైసీ ఆరోపణలు చేసారు. పద్మావత్ ని అడ్డుకునేందుకు మోడీనే 12 మంది సభ్యుల కమిటీని నియమించారని అన్నారు.