ఆశలు రేకెత్తిస్తున్న ఆక్సఫర్డ్ వాక్సిన్… తొలి క్లినికల్ ట్రయల్స్ విజయవంతం!

Tuesday, July 21st, 2020, 12:11:54 AM IST


ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ వైరస్ కు ఇంకా వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో భారీగా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అయితే ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పింది.కరోనా వైరస్ మహమ్మారి ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అక్స్ ఫర్డ్ వాక్సిన్ పని చేస్తోంది అని వివరించింది. అయితే ఇందుకు సంబంధించిన తొలి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయినట్లు తెలిపింది.

అయితే ఈ వాక్సిన్ ను 1,077 మంది పై ప్రయోగించగా అందరి లో కూడా రోగ నిరోధక శక్తి పెరిగింది అని, దాదాపు 90 శాతం మందికి ఒక్క డోస్ లో రోగ నిరోధక శక్తి అభివృద్ది కాగా, మిగతా 10 శాతం మందికి రెండో డోస్ అవసరం వచ్చిన విషయాన్ని ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమి లేవు అని, కాకపోతే 70 శాతం మందికి జ్వరం, తలనొప్పి వస్తుంది అని, అయితే వాటిని పారా సిట్మాల్ ద్వారా తగ్గించినట్లు తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో కరోనా వైరస్ పై సత్ఫలితాలు రావాలి అంటే భారీగా ప్రయోగాలు చేయాలి అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వాక్సిన్ ఈ ఏడాది చివరి వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.