డోంట్ మిస్: కరోనా తో ప్రధాన సమస్య అదే!

Friday, June 26th, 2020, 06:39:30 PM IST

కరోనా వైరస్ మహమ్మారి దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. భారత్ లో నమోదు అవుతున్న సంఖ్యలు చూస్తుంటే, మున్ముందు పరిస్థితి మరింత దారుణంగా అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కరోనా వైరస్ తో ఉండే ప్రధాన సమస్య ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం. అసలు95 శాతంగా ఉండాల్సిన ఆక్సిజన్ కరోనా ఆటాక్ తర్వాత తగ్గుతుంది. అయితే ఈ లెవెల్స్ కాస్త 90 శాతానికి పడిపోతే ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. 90 నుండి 85 శాతం పడిపోతే ఆక్సిజన్ తీసుకొనే ప్రక్రియలో తీవ్ర ఇబ్బంది ఎదురు అవుతుంది అని అంటున్నారు.

అయితే ప్రస్తుతం ఇంతకంటే దారుణంగా, అనగా, ఆక్సిజన్ లెవెల్స్ 85 శాతం కంటే తక్కువ పడిపోతే అత్యంత ప్రమాదకరం అని చెబుతున్నారు.పలు ఆసుపత్రులలో బెడ్ల సంఖ్య ను పెంచుతున్నట్లు గా అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఊహించని రీతిలో నిన్న ఒక్క రోజే 920 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ప్రజలు కరోనా వైరస్ నివారణ చర్యలు పాటించక పోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు అని కొందరు చెబుతున్నారు.