మ‌స్ట్ వాచ్ ట్రైల‌ర్ : కేక పెట్టిస్తున్న రోబో వార్‌!!

Thursday, January 25th, 2018, 02:48:05 PM IST

హాలీవుడ్‌లో సూప‌ర్ హీరోల సిరీస్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. అయితే ఆ జోన‌ర్‌కి భిన్న‌మైన‌ది రోబోటిక్ వారియ‌ర్ జోన‌ర్‌. ఈ జోన‌ర్‌లో ట్రాన్స్‌ఫార్మ‌ర్స్ సిరీస్ సంచ‌ల‌నాల గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఈ సిరీస్‌లో ఇప్ప‌టికే ఐదు సినిమాలు వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించాయి. ఇక ఇదే త‌ర‌హాలో `ప‌సిపిక్ రిమ్‌` అనే చిత్రం 2016లో రిలీజైంది. ఓ భీక‌ర‌మైన జ‌ల‌చ‌ర రాకాశి స‌ముద్రంలోంచి న‌గ‌రాల‌పైకి దూసుకొచ్చి విధ్వంశం సృష్టిస్తుంటుంది. ఆ భీక‌ర రాకాశి భీభ‌త్సాన్ని ఎదుర్కొనేందుకు కొన్ని ప్ర‌త్యేక‌మైన రోబోల్ని రంగంలోకి దించాల్సొస్తుంది. ఆ క్ర‌మంలో ఆ జ‌ల‌చ‌ర రాకాశితో మ‌నిషి పోరాటం ఏంటి? అన్న‌ది `ప‌సిపిక్ రిమ్` సినిమాలో చూపించారు. గొప్ప వండ‌ర్‌గా ఏం లేక‌పోయినా ఈ సినిమా సాంకేతికంగా హై రేంజులో ఉంటుంది.

అయితే ఈసారి ఈ సినిమాకి సీక్వెల్ వ‌స్తోంది. ప‌సిపిక్ రిమ్ అప్‌రైజింగ్ అనేది టైటిల్‌. తాజాగా రిలీజైన ట్రైల‌ర్ చూస్తుంటే మ‌తి చెడాల్సిందే. రోబోటిక్స్‌లో అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీని అందిపుచ్చుకుని తెర‌కెక్కించిన ఈ సినిమా సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయం అని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. భీక‌రాకారాల భారీ పోరాటాలు, సాహ‌సాల నేప‌థ్యంలో ఈ సినిమా ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది. సైన్స్ ఫిక్ష‌న్‌, రోబో సినిమాల్లోనే మ‌రో భీక‌ర‌మైన సినిమా ఇద‌ని ట్రైల‌ర్ చెబుతోంది. మార్చిలో సినిమా రిలీజ్ కానుంఇ. యూనివ‌ర్శల్ ఫిలింస్‌-లెజెండ‌రీ మూవీస్ సంస్థ‌లు నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది.