బాబోయ్ పద్మావతి దెబ్బకు ఆ రికార్డులు బద్దలు ?

Friday, January 26th, 2018, 12:07:20 PM IST

మొత్తానికి బాలీవుడ్ పద్మావతి సత్తా చాటుకుంది. ఎన్నో సంచలనాల నడుమ విడుదలైన పద్మావతి మొదటి రోజే తన హవా చాటింది. ఇప్పటికే ఈ సినిమా నార్త్ లో ఓ రేంజ్ వసూళ్లు అందుకుంటూ జోరును ప్రదర్శిస్తుంది. ఇక సోత్ లో పరిస్థితి మామూలుగానే ఉంది ఇప్పటికే అటు ఓవెర్సెస్ మార్కెట్ లో కూడా పద్మావతి తన క్రేజ్ తో మంచి వసూళ్లను రాబట్టింది. అంతర్జాతీయ మార్కెట్ లో మిగతా సినిమాల రికార్డును దాటేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ , అమెరికా లలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు ప్రీమియర్ లతో కలుపుకుని బాహుబలి 2 – 212 వేల డాలర్స్, దంగల్ – 247 వేల డాలర్స్ వసూళ్లను బీట్ చేసి ఏకంగా 367 వేల డాలర్స్ వసూలు చేసి సత్తా చాటింది. మొత్తానికి బాహుబలి 2, దంగల్ లాంటి సినిమాలను దాటేసిన పద్మావతి అటు బాక్స్ఆఫీస్ వద్ద దుమ్ము రేపడం ఖాయమని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.