ప్రీమియర్ షో టాక్ : వివాదాల ‘పద్మావత్’ ఎలా ఉందంటే..!

Tuesday, January 23rd, 2018, 10:43:00 PM IST

పద్మావత్.. విడుదలకు ముందు నుంచే ఇంకా చెప్పాలంటే చిత్రీకరణ దశ నుంచే తీవ్రమైన వివాదంలో ఈ చిత్రం ఇరుక్కుంది. విడుదల సమయం దగ్గరపడే కొద్దీ ఈ చిత్ర వివాదాలు మరింతగా ఎక్కువయ్యాయి. సెన్సార్ సభ్యులకైతే ఈ చిత్రం తలకు మించిన భారంగా మారింది. ఓ దశలో ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. అన్ని అడ్డంకుల్ని దాటుకుని ఈ చిత్రం జనవరి 26 న విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా నేడు హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీమియర్ షో లు ప్రదర్శించారు. దీపికా పదుకొనె, షాహిద్ కపూర్ మరియు రణవీర్ సింగ్ లు ప్రధాన పాత్రలో నటించారు. భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వివాదాల పద్మావత్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..

మహారాణి పద్మావతి మరియు సుల్తాన్ అల్లా వుద్దీన్ ఖిల్జీల కథ ఇది. ఇలాంటి చారిత్రాత్మక చిత్రంలో దర్శకుడు బన్సాలి ఎమోషన్స్ ని హైలైట్ చేసిన విధానం బావుంది. విజువల్స్ పరంగా దర్శకుడు మరో సారి తన ప్రత్యేకతని చాటుకున్నారు. బన్సాలి చిత్రాల్లో విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రంలో కూడా అదేస్థాయిలో ఉన్నాయి. ప్రధాన పాత్రల్లో నటించిన దీపికా పదుకొనె, షాహిద్ కపూర్ మరియు రణవీర్ సింగ్ ల నటన ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా అల్లా వుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ సింగ్ జీవించాడు. అతడి నటన సినిమాకి ప్లస్ హైలైట్. ఈ చిత్రం కోసం నిర్మించిన సెట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రంలో సెట్స్ వర్క్ కూడా చాలా బావుంది. పద్మావత్ అనే చిత్రం పూర్తిగా ఉత్తరాది ప్రజల ఎమోషన్స్ తో ముడిపడిన చిత్రం. కాబట్టి బాలీవుడ్ ప్రేక్షకుల ఈ చిత్రం బాగా నచ్చుతుంది. ఇక మన తెలుగు ఆడియన్స్ ని ఈ చిత్రం పూర్తి స్థాయిలో మెప్పించే అవకాశాలు లేవు. దర్శకుడు నటన, ఎమోషన్స్ ని హైలైట్ చేసాడు కానీ యుద్ధ సన్నివేశాల విషయంలో అంతగా శ్రద్ద పెట్టినట్లు లేదు. ఇలాంటి తరహా చిత్రాలకు మాస్ ఆడియన్స్ యుద్ద సన్నివేశాలని ఆస్వాదించాడనికి వెళతారు. ఈ నేపథ్యంలో బాహుబలితో పోల్చుకుంటే మాత్రం నిరాశ తప్పదు. మొత్తగా పద్మావతి చిత్రం తెలుగులో యావరేజ్ సినిమాగా మిగిలిపోనుంది. పైన చెప్పుకున్న పాజిటివ్ అంశాల కోసం ఈ సినిమాని ఒకసారి చూసి ఆస్వాదించవచ్చు.