ప‌ద్మావ‌త్ ఆరు రోజుల్లో 225 కోట్లు

Thursday, February 1st, 2018, 11:46:29 AM IST

వివాదాలు ఓవైపు.. వ‌సూళ్లు మ‌రోవైపు .. ప‌ద్మావ‌త్ స‌న్నివేశం ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తోంది. ఈ సినిమా ఇంటా బ‌య‌టా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్ప‌టికీ కొన్నిచోట్ల రిలీజ్ కాక‌పోయ‌నా వసూళ్లు ఏమాత్రం తీసిక‌ట్టుగా లేవు. భ‌న్సాలీ అందించిన 3డి విజువ‌ల్ వండ‌ర్‌గా ఈ చిత్రాన్ని ప్ర‌పంచ దేశాల్లోని భార‌తీయులు వోన్ చేసుకుని మ‌రీ చేస్తున్నారు. దీంతో ఓవ‌ర్సీస్‌లోనూ వ‌సూళ్ల హ‌వా సాగుతోంది. భార‌త్‌, అమెరికా, కెన‌డా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌, .. ఇలా ప్ర‌తిచోటా ప‌ద్మావ‌త్ వ‌సూళ్లు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి.

`ప‌ద్మావ‌త్‌` కేవ‌లం ఆరు రోజుల్లో 225 కోట్లు వ‌సూలు చేసింది. గురువారం-19 కోట్లు, శుక్ర‌వారం-32 కోట్లు, శ‌నివారం-27 కోట్లు, ఆదివారం-31కోట్లు, సోమ వారం-15 కోట్లు, మంగ‌ళ‌వారం-14 కోట్లు వ‌సూలు చేయ‌డం చూస్తుంటే.. నాన్ హాలిడేస్‌లోనూ ఫ‌ర్వాలేద‌నిపించింది. ఓవ‌ర్సీస్‌లో 76 కోట్లు (12 మిలియ‌న్ డాల‌ర్లు) వ‌సూలైంది. ఓవ‌రాల్‌గా 225 కోట్లు వ‌సూలైంది. ఆ మేర‌కు ప్ర‌ఖ్యాత ఫిలింక్రిటిక్‌ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ బాక్సాఫీస్ వివ‌రాల్ని అందించారు. ప‌ద్మావ‌త్ సాధించిన అసాధార‌ణ విజ‌యంతో దీపిక‌కు 7వ వంద కోట్ల క్ల‌బ్ సినిమా ద‌క్కింది. ర‌ణ‌వీర్‌కి 3వ వంద కోట్ల సినిమాగా రికార్డునిచ్చింది.