`ప‌ద్మావ‌త్‌` నాలుగు రోజుల్లో 100 కోట్లు?

Saturday, January 27th, 2018, 01:51:15 PM IST

సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన `ప‌ద్మావ‌త్‌` ఓపెనింగులు అద‌ర‌గొట్టేస్తోంది. ఓవైపు నాలుగు రాష్ట్రాల్లో వివాదాస్ప‌ద న‌గ‌రాల్లో ఈ సినిమాని బ్యాన్ చేసినా, ఇత‌ర చోట్ల వ‌సూళ్ల‌ను ఇర‌గ‌దీసేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న బాహుబ‌లి -2 రికార్డుల్ని కొట్టేయ‌క‌పోయినా ఈ సినిమా వ‌సూళ్ల‌లో మాత్రం త‌క్కువేం లేదు. డే-1 వ‌సూళ్ల‌ను మించి రెండో రోజు వ‌సూళ్లు ద‌క్కాయి. మొద‌టి రోజు 19 కోట్లు వ‌సూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు ఏకంగా 36 కోట్లు వ‌సూలు చేసింది. ఇత‌ర‌త్రా చోట్ల వ‌సూళ్లు క‌లుపుకుని మొత్తంగా 56 కోట్ల మేర వ‌సూలు చేసింద‌ని, కేవ‌లం ఇండియాలో 40 కోట్లు పైగా వ‌సూలు చేసింద‌ని రిపోర్ట్ అందింది.

వాస్త‌వానికి బ్యాన్ విధించిన న‌గ‌రాల్లోనూ రిలీజై ఉంటే 70 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేసి ఉండేద‌ని త‌ర‌ణ్ ఆద‌ర్శ్ వంటి విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రో రెండ్రోజుల్లో 50 కోట్ల వ‌సూలు చేసినా, నాలుగు రోజుల్లోనే ప‌ద్మావ‌త్ 100 కోట్ల క్ల‌బ్లో చేరుతుంది. మొత్తానికి భ‌న్సాలీ క‌ష్టానికి స‌రైన ప్ర‌తిఫ‌లం ద‌క్కిన‌ట్టే. మ‌రో వారం రోజులు ఇదే జోరు కొన‌సాగించే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి.. సేఫ్ ప్రాజెక్ట్ కిందే లెక్క‌. ఇక ప‌ద్మావ‌త్‌ని 3డిలో వీక్షించిన వారు మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నుకోవ‌డం ఖాయం.