దర్శకుడి తల నరకండి..రూ.51 లక్షలు పట్టుకెళ్లండి!

Friday, January 26th, 2018, 05:09:52 PM IST


గత కొంత కాలంగా వివాదాల నడుమ తెరకెక్కిన పద్మవత్ సినిమా కూల్ గా రిలీజ్ అయ్యింది అవ్వబోతోందని అంతా అనుకున్నారు. సెన్సార్ పూర్తవ్వడంతో కొన్ని మార్పులు చేసి సినిమాను రిలీజ్ చేసినా కూడా ఇంకా వివాదాలు ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా దాడులు దారుణంగా జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో హిందూ సంఘాలు ఆందోళన పేరుతో విధ్వంసాలను సృష్టిస్తున్నాయి. సినిమా హాళ్లకు షాపింగ్ మాల్స్ కు నిప్పంటించి భారీ ఆస్థి నష్టాన్ని కలుగజేస్తున్నారు.

అంతే కాకుండా చిత్ర యూనిట్ పై భయంకర వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. రీసెంట్ గా క్షత్రియ మహాసభ అధ్యక్షుడు గజేంద్ర సింగ్ దీపికా పదుకొనేపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆమె ముక్కు చెవులు కోసేస్తే కమ్యూనిటీ తరపున కోటి రూపాయల వరకు నజరానా ఇస్తామని చెప్పారు. ఇక శుక్రవారం రోజు దర్శకుడిపై కూడా అదే రేంజ్ లో ఆల్‌ ఇండియా బ్రజ్‌మండల్‌ క్షత్రియ రాజ్‌పుత్‌ మహాసభ ఉపాధ్యక్షుడు దివాకర్ సింగ్ విమర్శలు చేశారు. సంజయ్ లీలా బన్సాలి తల నరికేస్తే 51 లక్షలు ఇస్తామని తెలుపడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా ఎటువంటి ఘటనలు జరగకుండా కొన్ని ప్రాంతాల్లో సెక్యూరిటీని పెంచారు. అంతే కాకుండా 144 సెక్షన్ కానీ కూడా అమలు చేస్తున్నారు.