ఫెస్ బుక్ లైవ్ లో పద్మావత్ లీక్

Thursday, January 25th, 2018, 06:38:46 PM IST

ప్రస్తుత రోజుల్లో టెక్నాలిజీ పెరిగిపోవడం వల్ల కొందరికి లాబం కలుగుతుంటే మరికొందరికి అదే టెక్నాలిజీ బాధను కలిగిస్తోంది. కోట్లు ఖర్చు పెట్టిన సినిమాలకు ఈ రోజుల్లో పైరేసి దెబ్బ చాలా పడుతోంది. ఇక అసలు విషయంలోకి వస్తే.. గత కొంత కాలంగా వివాదాలను ఎదుర్కొంటున్న పద్మావతి సినిమా ఎట్టకేలకు గురువారం రిలీజ్ అయ్యింది. అయితే సినిమా మొదటి షోకే పైరేసి భూతం నిర్మాతలకి భయాన్ని చూపించింది.

ఏకంగా ఫెస్ బుక్ లైవ్ రావడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఆ న్యూస్ వైరల్ గా మారింది. అసలే ఓ వైపు కర్ణిసేన బెదిరింపులను ఎదుర్కొంటు పలు రాష్ట్రాల్లో సినిమాను విడుదల చేయలేని పరిస్థితి. ఇక కొన్ని రాష్ట్రాల్లో సెక్యూరిటీ మధ్యన సినిమాను చూసే దుస్థితి. ఈ ఘటనల వల్ల జనాలు సినిమాను చూడడటానికి ఆసక్తిని చూపడం లేదు. దీంతో సినిమా కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక ఇప్పుడు పైరేసి కూడా సినిమాను సతమతం అయ్యేలా చేస్తోంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో లాభాలను ఇస్తుందో చూడాలి.