అక్కడ కలెక్షన్ల దుమ్ము దులుపుతున్న పద్మావత్ !

Monday, February 12th, 2018, 06:10:28 PM IST

ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పాడుకొనే ప్రధాన పాత్రలో సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన చిత్రం పద్మావత్. వాస్తవానికి ఎన్నో రకాల వివాదాల నడుమ ఎట్టకేలకు ఘతన నెల 25న విడుదలయిన ఈ చిత్రం మంచి టాక్ బాలీవుడ్ లో అతి పెద్ద హిట్ చిత్రాల వసరుసలో నిలిచే విధంగా దూసుకుపోతోంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం ఓవర్సీస్ లో అద్భుత రికార్డ్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఈ చిత్రం 10 మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన మూఢ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. అయితే ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం 12.5 మిలియన్ డాల్లర్ లతో మొదటి స్థానం, ఆయనే నటించిన పీకే చిత్రం రెండవ స్థానం లో నిలిచాయి. అయితే ఈ సినిమా కనుక ఇంకొన్నాళ్ళు అక్కడ మంచి కలెక్షన్లు సాధిస్తే దంగల్ రికార్డ్ ను అందుకోవటం ఖాయమంటున్నారు. అయితే ఇప్పటికే బాహుబలి రెండవభాగం 21 మిలియన్ డాలర్లతో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రం గా నిలిచింది….