షాక్ .. తెలంగాణకు సోకిన పద్మవత్ సెగ ?

Monday, January 22nd, 2018, 11:41:47 AM IST

ఇప్పటికే బాలీవుడ్ లో పలు సంచలనాలు క్రియేట్ చేస్తున్న పద్మావతీ చిత్రం విడుదల విషయంలో నెలకొన్న సమస్యలను దాటుకుంటూ ఈ నెల 25న విడుదలకు సిద్ధమైంది. రాజ్ ఫుట్ లు ఈ చిత్రాన్ని విడుదల చేయవద్దంటూ, ఒకవేళ విడుదల చేస్తే థియేటర్స్ ని కాల్చేస్తామని వార్ణింగ్ ఇచ్చిన నేపథ్యంలో అటు సెన్సార్ తో పాటు పలు రాష్ట్రాలు కూడా సినిమా విడుదలను అడ్డుకున్నాయి. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాక విడుదల దగ్గర పడడం తో ఇప్పుడు పద్మావతి సెగ తెలంగాణకు సోకింది ? ఈ చిత్రాన్ని తెలంగాణ లో విడుదల చేయకూడదని రాజ్ పుత్ క్రాంతి సేనలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఠాకూర్ సినిమా విడుదలను తెలంగాణాలో ఆపాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ లోని ఆగాపుర లో మహారణా ప్రతాప్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. మరో వైపు టీవోలి సినిమా థియేటర్ వద్ద రాజస్థాన్ కు చెందిన 50 మంది రాజ్ పుత్ యువకులు ఆందోళన చేపట్టి దర్శక నిర్మాతలకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.