పద్మావత్ వర్సెస్ కర్ణిసేన.. యుద్ధం మొదలైంది!

Wednesday, January 24th, 2018, 09:24:16 AM IST

గత కొంత కాలంగా బాలీవుడ్ లో సంచలనంగా మారిన పద్మావత్ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కు సిద్ధమైంది. జనవరి 26న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు కష్టపడుతున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో విడుదల కానివ్వమని ఇంతకుముందు కర్ణసేన హెచ్చరికలు జారీ చేసినా సంగతి తెలిసిందే. కానీ సెన్సార్ అందుకున్న తరువాత సినిమా ఏ వివాదాలకు తావివ్వకుండా రిలీజ్ కాబోతోంది అని అందరు అనుకున్నారు. ప్రెస్ షోలు కూడా కొన్ని ప్రదర్శించబడ్డాయి.

అయితే కర్ణి సేన కార్యకర్తలు ఎవరు ఊహించని విధంగా నిన్ని పలు చోట్ల విధ్వంసం సృష్టించారు.
అహ్మదాబాద్ వన్ మాల్స్, హిమాలయ వంటి థియేటర్ల పై దాడులు చేశారు. నిప్పు అంటించి ఆస్థి నష్టం కలిగించారు. అంతే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న 150 వాహనాలాలకు కూడా నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చే లోపే పరిస్థితి చేయి ధాటి పోయింది. మధ్య ప్రదేశ్ – ఉత్తర ప్రదేశ్ అలాగే రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో కూడా కొన్ని హిందూ సంఘల ఆందోళనలు తార స్థాయికి పెరిగిపోయాయి. దీంతో పలు చోట్ల పోలీసులు 144 సెక్షన్ ను అమలుపరిచారు. ఇక కొన్ని థియేటర్స్ ముందు పద్మావత్ సినిమా ప్రదర్శించడం లేదనే బోర్డులు దర్శనం ఇచ్చాయి.