పాక్ చర్యతో మోదీకి కాస్త రిలీఫ్ దొరికింది

Thursday, January 14th, 2016, 06:32:07 PM IST


పాక్ ప్రధానమంత్రి ఈరోజు తీసుకున్న నిర్ణయం భారత్ ప్రధాని మోదీకి కాస్త ఊరటను కలిగించింది. ఈరోజు ఉదయం పాక్ జైష్ ఎ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మౌలానా మసూద్ అజహర్, అతని సోదరుడు అబ్దుల్ రహ్మాన్ రవూఫ్, మరికొందరు అనుచరులను అరెస్టుచేసినట్టు తెలిపింది. ఈ చర్యతో మోదీ ఉగ్రవాద నిర్మూలనా ప్రయత్నాలు కాస్త ఫలించినట్లు కనిపించాయి.

పఠాన్ కోట్ పై దాడి జరిగిన అనంతరం మొడీ పాక్ తో దౌత్య పరమైన సంభంధాలను కొనసాగించటంలో విఫలంయ్యారంన్ అవార్తలు వచ్చాయి. దాడికి కొన్నిరోజుల ముందు మోదీ పాక్ వెళ్లి నవాజ్ షరీఫ్ తో చర్చలు జరిపి ఆయన మనవరాలి పెళ్ళి వేడుకలో కూడా పాల్గొన్నారు. 2014 ఎన్నికలప్పుడు మోదీ ఉగ్రవాద నిర్మూలనే ప్రధాన ధ్యేయమని ప్రజలకు మాటిచ్చారు. కానీ వరుసగా భారత్ లో జరిగిన ఉగ్రవాద చర్యలు ఆయనకు తలనొప్పిగా మారాయి. కానీ ఇప్పుడు పాక్ చర్యతో మోదీకి రాజకీయంగా కాస్త ఉపశమనం కలిగినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.