మన సైనికులని మనమే చంపుకున్నామట

Wednesday, September 28th, 2016, 04:18:07 PM IST

solders
అసలే ఊరీ ఉగ్రవాదుల దాడి దెబ్బకి భారత్ అత్యంత కోపంతో ఉంటే , పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసే మూర్ఖపు వ్యాఖ్యలు ఈ దేశానికి ఇంకా కోపం తెప్పిస్తున్నాయి. తలా తోకా లేని వ్యాఖ్యలు చెయ్యడం పాకిస్తాన్ కి కొత్తేమీ కాదు గానీ ఈ సారి రూటు మార్చిన పాకిస్తాన్ ఊరీ దాడి మన ఆర్మీ మీద మనమే చేసుకున్న కుట్ర అంటోంది. సాక్షాత్తూ పాకిస్తాన్ రక్షణ మంత్రికాజ్వా ఆసిఫ్ ఈ మాటలు అనడం బాధాకరం. పైగా తమ ఆర్మీని తామే చంపుకుని పాకిస్తాన్ మీద నేట్టేయ్యడం వారికి కొత్తేమీ కాదు అంటున్నాడు ఆయన. ” ఊరీ దాడిని ఆ దేశమే సృష్టించుకుంది , మా దేశానికీ ఆ దాడితో ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం నాతో పాటు మా ప్రభుత్వం , కేంద్రం కూడా నమ్ముతోంది ” అని ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన పేర్కొన్నారు. ఊరీ సంఘటన ద్వారా ప్రపంచ దేశాల నుంచి తాము విమర్శలు ఎదురుకోవాల్సి ఒస్తోంది .. దీంతో పాకిస్తాన్ కొత్త గొంతు ఎత్తింది , ఈ మధ్యనే పాకిస్తాన్ ప్రధాని కూడా ఇలాంటి వ్యాఖ్యలే చెయ్యడం గమనార్హం. ఎటొచ్చీ భారత్ ని ధైర్యంగా ఎదురుకోనలేక ఇలాంటి పిరికిపంద చర్యలకి పాల్పడుతూ తిరిగి భారత్ మీదనే తప్పు నెట్టడం ఎంతటి మూర్ఖత్వమో జనమే చెప్పాలి.

  •  
  •  
  •  
  •  

Comments