కోర్టు గొడ‌వ‌ : `పాకీజా` మూవీ రైట్స్‌ కోసం పోరాటం!

Sunday, October 22nd, 2017, 09:00:25 AM IST

నాటి మేటి న‌టి మీనాకుమారి న‌టించిన `పాకీజా` బాలీవుడ్ మేటి క్లాసిక్‌గా మ‌న్న‌న‌లు అందుకున్న సంగ‌తి తెలిసిందే. 1956లో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభిస్తే, దాదాపు ప‌ద‌హారేళ్ల గ్యాప్ త‌ర్వాత అంటే 1972లో రిలీజైంది. అయితే అన్నేళ్ల పాటు ఆ సినిమా రిలీజ్ కి ఎదురు చూడాల్సొచ్చిందంటే.. ఆ వెన‌క ఉన్న క‌థ గురించి తెలియాలి.

అస‌లు వివ‌రంలోకి వెళితే.. పాకీజా చిత్రం ప‌ద హారేళ్ల పాటు ఇలా ల్యాబుల్లోనే మ‌గ్గిపోవ‌డానికి చాలా పెద్ద కార‌ణ‌మే ఉంది. ఈ సినిమాని మీనాకుమారి భ‌ర్త అయిన క‌మ‌ల్ ఆమ్రోహి స్వ‌యంగా తెర‌కెక్కించారు. అయితే మీనాకుమారి అనారోగ్యం.. త‌దిత‌ర కార‌ణాలు ఇబ్బందిక‌రంగా మారాయి. ఆ క్ర‌మంలోనే ఆమ్రోహి అనంత‌రం న‌ష్టాల వ‌ల్ల అత‌డి వార‌సులు.. క‌మ‌లిస్తాన్ స్టూడియోస్‌ని, సొంత బ్యాన‌ర్ మ‌హ‌ల్ పిక్చ‌ర్స్‌ని అమ్ముకోవాల్స‌చ్చింది. పూణేకి చెందిన డిబి రియాలిటీ కంపెనీ ఈ ఆస్తుల్ని కొనుక్కుంది. ఆ క్ర‌మంలోనే స‌ద‌రు కంపెనీతో ఆమ్రోలి వార‌సుల‌కు ఓ చిక్కొచ్చి ప‌డింది. పాకీజా సినిమా త‌మ‌కే ద‌క్కుతుంద‌ని డిబి రియాలిటీ సంస్థ కోర్టులో వ్యాజ్యం వేసింది. కాదు.. అది త‌మ తండ్రి ఆస్తి అంటూ వార‌సులు వాదించారు. అలా అది కోర్టు గొడ‌వ‌ల‌కే ప‌రిమిత‌మైంది. ఇప్ప‌టికీ దీనికి సంబంధించి కోర్టులో గొడ‌వ ర‌న్ అవుతోంది. వాస్త‌వానికి 1971లో క‌మ‌ల్ ఆమ్రోహీ పేరుపై సెన్సార్ స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. 1972లో సినిమా రిలీజైంది. అప్ప‌టినుంచి ఇప్ప‌టికీ ఈ సినిమా హ‌క్కుల విష‌య‌మై కోర్టు గొడ‌వ‌లు తేల‌క‌పోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కొచ్చింది. ఇప్ప‌టికీ త‌మ వార‌స‌త్వ సంప‌దగా భావిస్తున్న `పాకీజా` చిత్రం త‌మ‌కే చెందుతుంద‌ని మీనాకుమారి- ఆమ్రోహి జంట వార‌సులు కోర్టులో పోరాడుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments