పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోవడానికి కారణం రావిశాస్త్రే

Saturday, October 14th, 2017, 04:45:31 PM IST

ఈ ఏడాది జూన్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్ లో భారత్ ఓడిపోయినా సంగతి తెలిసిందే. పాకిస్థాన్ చేతిలో కోహ్లీ సేన ఓటమిపాలవ్వడం ఇప్పటికి భారత అభిమానులు ఓర్చుకోలేకపోతున్నారు. దాయాది దేశంపై ఎలాగైనా గెలుస్తుందని అందరు అందుకున్నారు. అదృష్టం తో ఫైనల్ వరకు వచ్చిన పాకిస్తాన్ అసలు ఏ మాత్రం గెలవదని క్రికెట్ దిగ్గజాలు కూడా కామెంట్స్ చేశారు. అయితే భారత్ ఓడిన తర్వాత అందరు షాక్ అయ్యారు.

అయితే పాకిస్తాన్ గెలవడానికి ఒక కారణం ఉందని పాక్‌ జట్టు మాజీ మేనేజర్‌ తలాత్‌ అలీ రీసెంట్ గా వ్యాఖ్యనించడం అందరిని ఆశ్చర్యపరిచింది. తలాల్ ఛాంపియన్స్ ట్రోపి సమయంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుగు మేనేజర్ గా ఉన్నాడు. ఇంటర్వ్యూలో తలల్ ఈ విధంగా కామెంట్ చేశాడు.. మ్యాచ్ జరిగే ముందు రవి శాస్త్రి – సునీల్ గవాస్కర్ ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అందులో వారు తప్పకుండా పాకిస్థాన్ ఓడిపోతుంది. భారత్ గెలవడం ఖాయమని చెప్పారు. అది చూసిన మా జట్టు సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. గ్రౌండ్ లోకి దిగిన తర్వాత కేవలం మొదట బ్యాట్ కు పనిచెప్పి ఆ తర్వాత బౌలింగ్ తో భారత ఆటగాళ్లను గట్టిగా ఎదుర్కొని విజయం సాధించారని తలాల్ చెబుతూ.. రవిశాస్త్రి – సునీల్ గవాస్కర్ మా విజయంలో కీలక పాత్ర పోషించారని కామెంట్స్ చేశారు.