ట్రంప్ ని చూసి భయపడుతున్న పాకిస్తాన్

Sunday, January 22nd, 2017, 12:33:18 PM IST

trump
అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరవాత డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగం మీద పాకిస్తాన్ భయపడుతోంది. ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంటూ భూమిమీద ఇస్లామిక్ టెర్రరిజం రూపు మాపుతా అంటూ ట్రంప్ అన్న మాటలకి పాకిస్తాన్ ఉలిక్కిపడింది. తమకి ట్రంప్ కచ్చితంగా నష్టం కలిగిస్తాడు అనే ఫీలింగ్ లో పాకిస్తాన్ ఉంది ప్రస్తుతం. ఉగ్రవాద గ్రూపులుగా ప్రపంచం ముందు గుర్తించబడ్డ పలు సంఘాలు పాక్ భూభాగంపైనే ఉన్నాయని, ఇతర దేశాల్లో ఉగ్రదాడులకు తమ భూమిపై నుంచే కుట్రలు జరుగుతున్నా, పాక్ మిన్నకుందన్న అభిప్రాయాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోకుంటే, తీవ్రంగా నష్టపోవాల్సి వుంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇస్లామిక్ ప్రపంచానికి జరిగే నష్టం ఎంతైనా, అందులో అత్యధికం తామే అనుభవించాల్సి వుంటుందన్న సంగతి పాక్ పాలకులు అర్థం చేసుకోవాలని వారు సూచించారు. ట్రంప్ వ్యాఖ్యల గురించి తాము గట్టిగా ఆలోచించాల్సి వుందని, పాక్ ప్రభుత్వం సత్వరమే ఉగ్రవాద ముద్రను తొలగించుకునేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.