క్రైస్తవులకి విషం ఇచ్చి చంపేసిన పాకిస్తానీయులు ??

Wednesday, December 28th, 2016, 12:27:19 PM IST

wine
క్రైస్తవులు ఘనంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలలో ఊహించని విషాదం జరిగింది. విషపూరితం అయి ఉన్న మద్యం తాగి 32 మంది చనిపోయారు. మరొక అరవై మందికి పైగా తీవ్ర అస్వస్థత కి గురయ్యారు. ఈ ఘటన పాకిస్థాన్ లోని టోబాటెక్ సింగ్ నగరంలో ఉన్న ముబారకాబాద్ క్రీస్టియన్ కాలనీలో చోటు చేసుకుంది. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా వారంతా సరదాగా మద్యం సేవించారు. మృతుల్లో ఎక్కువ మంది క్రీస్టియన్లే ఉన్నారు. ఈ ఘటనకు కారకులైన తండ్రీకొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును దర్యాప్తు చేసేందుకు ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ లో ముస్లిం లకి మాద్యం అమ్మారు. అక్కడ అది నిషేధం. ఇతర విదేశీయులకీ , మైనారిటీ వర్గాలకీ మద్యం తాగే అనుమతి ఉన్నా కూడా కొన్ని గట్టి నిబంధనలు ఉన్నాయి. గత హోలీ వేడుకల్లో కూడా కల్తీ మద్యాన్ని తీసుకుని 45 మంది చనిపోయారు. వారిలో 35 మంది హిందువులే కావడం గమనార్హం. ఈ వేడుకలో కూడా విషం కావాలనే కలిపారు అనే ఆరోపణలు ఉన్నాయి .

  •  
  •  
  •  
  •  

Comments