మాట్లాడుకుంటే చాలు..ఇండియా, పాక్ యుద్ధం పై ఆఫ్రిది !

Friday, September 30th, 2016, 05:38:23 PM IST

Shahid-Afridi
పీవోకే లో భారత సైన్యం జరిపిన సిర్జికల్ స్ట్రైక్స్ పై పాక్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది తనదైన శైలిలో స్పందించారు.క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఆఫ్రిది ప్రస్తుతం సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.భారత్ పాక్ లమధ్య యుద్ధం రావచ్చు అనే ఊహాగానాల నేపథ్యం లో ఆఫ్రిది స్పందించాడు.

సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్చల ద్వారా అవకాశం ఉందని ఆఫ్రిది అన్నారు.ఇలాంటి మార్గాలు ఉండగా యుద్ధం లాంటి కఠిన నిర్ణయాలు వద్దు అని ఆఫ్రిది అన్నారు. పైగా పాక్ శాంతిని కోరుకునే దేశమని అన్నాడు. ఇండియా తో సుహృద్భావ సంబంధాలను పాక్ కోరుకుంటోందని అన్నాడు.యుద్ధమే కనుక వస్తే ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోవలసి ఉంటుందని వెల్లడించాడు. అందుకే యుద్ధం వద్దు అని అంటున్నానని ఆఫ్రిది అనడం విశేషం.తాను క్రికెట్ ఆడిన అన్ని దేశాల్లో భారత్ లో ఆడడమే గొప్పగా భావించానని ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పాక్ లో వివాదం గా మారాయి.